ఆంజనేయుడిని దళితుడితో పోల్చిన ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు

Spread the love

ప్రజల్ని మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులు రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు.. దేశం లోని ప్రతి రాజకీయనాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. అలాగే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక సభలో హనుమంతుడిని దూషించాడని హిందూ సంస్థ వారు ఈ ముఖ్యమంత్రికి నోటీసులు పంపించారు..

ఇప్పుడు అసలు విషయానికొస్తే రాజస్థాన్ లో ఎన్నికల హడావుడి మొదలైంది రాజస్థాన్ లోని ఆల్వా జిల్లా మాలాఖేడ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ర్యాలీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు..

ఈ సభలోనే యోగి హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. హనుమంతుడు అడవిలో జీవించే వాడని, దళితుడికి సంభందించిన నిరుపేద అని, రాముని ఆదేశాల మేరకు భారత సమాజాన్ని ఒకటిగా చేయడానికి కృషి చేసాడని చెప్పుకొచ్చాడు.. అలాగే మనం కూడా రామునికి ఓటు వేద్దాం రావణుడికి కాదు అంటూ చెలరేగిపోయాడు..

ఇలా మాట్లాడేసరికి రాజస్థాన్ కి సంభందించిన రాజస్థాన్ సర్వ్ బ్రాహ్మిణ్ సంస్థ మహాసభ అధ్యక్షుడు సురేష్‌ మిశ్రా
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి నోటీసులు పంపారు.. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు..


Spread the love