హత్యా నిందితులతో ప్రచారానికి వచ్చిన టి ఆర్ ఎస్ అభ్యర్థిని ని నిలదీసిన ఓటర్లు

Spread the love

అశ్వారావు పేట టి ఆర్ ఎస్ అబ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు చేదు అనుభవం ఎదురైంది.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లుకు వేముల చిట్టెమ్మ అనే మహిళ నది రోడ్డుపై నిలదీసింది.. అసలు విషయానికొస్తే వేముల చిట్టెమ్మ కొడుకు పోయిన సంవత్సరం దారుణ హత్యకు గురయ్యాడు..

ఇతను కాంగ్రెస్ కి సానుభూతిపరుడు కావున ప్రత్యర్థులు ఇతనిని దారుణంగా హతమార్చారు.. ఆ హత్యా కేసులో ఉన్న నిందితులు తాటి వెంకటేశ్వర్లు తో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇది చుసిన ఆ మహిళ ఆ టి.ఆర్ .ఎస్ అభ్యర్థిని అక్కడే నిలదీసింది..

దానికి అతను స్పందిస్తూ ప్రచారం అంటే చాల మంది వస్తుంటారు వాళ్లలో ఎవరో మనం కనుకునే సమయం దొరకదు అని వివరించిన అక్కడున్న మహిళలు ఊరుకోలేదు.. అసలే ఎన్నికల సమయం అందరు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు.. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా జరిగిన ఓటు బ్యాంకు మొత్తం గల్లంతైపోతుంది.. అలాంటిది ఈ అభ్యర్థులు కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని అందరు భావిస్తున్నారు…


Spread the love