తెలుగులో ప్రయాణం మొదలెట్టేశారు బోణి అదిరింది

Spread the love

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ ఇటీవల విడుదలైన టాక్సీవాలా మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే..ఇప్పుడు విజయ దేవరకొండ రష్మిక మందన్న తో జత కట్టి డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీ గా ఉన్నాడు..

టాలీవుడ్ లో తన సత్తా చాటిన విజయ్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..అది కూడా చిన్న చితకా సెలబ్రిటీస్ కాదు నేరుగా కరణ్ జోహార్ మరియు అందాల తార శ్రీదేవి కూతురు ఝాన్వి తో నటించే అవకాశాన్ని కొట్టేసాడు..కరణ్ జోహార్ మరియు ఝాన్వి తో కరణ్ జోహార్ మరియు ఝాన్వి తో ఇప్పటికే మంతనాలు జరిపిన విజయ్ వీళ్ళ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అయిపోయాడు..

ఒక కార్యక్రమంలో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వి విజయ్ ని ఆకాశానికెత్తేసింది ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే నువ్వు ఏ నటుడిగా మారాలని అనుకుంటున్నావు? ఎందుకు? అని కరణ్‌ జోహార్‌ జాన్విని ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. విజయ్‌ దేవరకొండ, అతనితో కలిసి నటించాలని ఉంది అని జాన్వీ సమాధానం ఇచ్చింది.

అలాగే విజయ్ ని కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్ వాళ్లు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నాకు కూడా జాన్వి తో నటించాలని ఉందని త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం అని విజయ్ చెప్పుకొచ్చాడు..

ఏదేమైనా వీళ్ళ జంట టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయబోతోందని అర్ధం అవుతుంది.టాలీవుడ్ లో ఇదొక సంచలంగా మారుతుందో లేదో చూడాలి జాన్వి సౌత్ లో నటించబోయే మొదటి సినిమా కనుక ఈ సినిమా పై అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..


Spread the love