తెలంగాణాలో నా పాత్ర మర్చిపోవద్దు సోనియా గాంధీ వీడియో వైరల్

Spread the love

కెసిఆర్ కో హటావో తెలంగాణ కో బచావో అంటున్న యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ . ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ నే అని తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ కి తప్ప మరి ఏ పార్టీ కి విశ్వసనీయత లేదు అని బంగారు తెలంగాణ ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.

తెలంగాణ లో ప్రచారాలు మరో రోజు మిగిలి ఉండటంతో నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టో లను సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు .తెరాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోచుకుందని హామీలు నెరవేర్చలేక పోయిందని, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలి అంటే డిసెంబర్ 7 న జరిగే ఎలక్షన్స్ లో ముహాకూటమి ని గెలిపించాలని యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

మరోసారి తెలంగాణ రాష్ట్రముపై పట్టు సాదించాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ .ఎలక్షన్స్ జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ప్రచార సభ లకు హాజరు కానీ సోనియా గాంధీ మొన్న తెలంగాణ రాష్ట్రము మేడ్చల్ సభ కు హాజరయ్యారు. మరోసారి ప్రచార సభ కు వస్తారని వేచి చూసిన కాంగ్రెస్ నాయకులూ కార్యకర్తలు,అభిమానులకి నిరాశ మిగిలింది.

అస్సలు విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగుండక ఇబ్బంది పడుతున్నారు. అయిన తెలంగాణ మీద ఉన్న ప్రేమ తో మొన్న మేడ్చల్ సభ కు వచ్చారని పలువురు నేతలు చెప్పారు.సోనియా గాంధీ మాట్లాడిన వీడియో ను కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసింది.

సోనియా గాంధీ వీడియో లో మాట్లాడిన మాటలు:

‘తెలంగాణ సోదరులకి, సోదరీమణులకు నా నమస్కారం. ఈనెల 7న తెలంగాణాలో మీరు మీమీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఓటు వేయబోతున్నారు. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తుతోపాటు మీ భవిష్యత్తు బాగుపడేందుకూ ఉపయోగపడేలా ఆ ఓటును వినియోగించుకోండి . కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ప్రజా ఫ్రంట్‌ కి ఓటు వేసి గెలిపించండి. ఇది మీ కూటమి ఈ కూటమి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల కోసం ఏర్పాటైంది. నాలుగున్నరేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే . రాష్ట్ర ఏర్పాటులో నేను అత్యంత కీలక పాత్ర పోషించాను. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారి చేతిలో మీరు మోసపోతున్నారు. మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకునే సమయం వచ్చింది. నా వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా ఫ్రంట్‌కు ఓటేయండి. జై హింద్‌, జై తెలంగాణ


Spread the love