తెలంగాణాలో ప్రచార కథ ముగిసింది

Spread the love

తెలంగాణ లో ఎన్నికల కథ ముగిసింది ఈరోజు సాయంత్రం 5 గంటలకి అన్ని పార్టీల అభ్యర్థులు వారి ప్రచార కార్యక్రమాలు ఆపుకోవాలని ఎలక్షన్ కమిటీ సూచించింది.. తెలంగాణ లో గత నెలరోజుల నుండి జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఈరోజు ముగియనుంది.. ఈరోజు 5 గంటల పైన ఎటువంటి ప్రచారాలు సమాచారాలు, సర్వేలు చేయకూడదని రజత్ కుమార్ ప్రకటించారు..

సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఇల్లందు, భూపాలపల్లి వంటి నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటలకి ప్రచార గడువు ముగుస్తుంది.. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.. సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమ తమ నియోజకవర్గాలలో పార్టీ నేతలు వాళ్ళ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

ఇప్పటి వరకు చాల సర్వేలు వచ్చిన కూడా తమ పార్టీ నాయకుడే విజయం సాధిస్తాడని పార్టీ శ్రేణులు బాహాటంగా ప్రకటిస్తున్నాయి.. తెలంగాణ లో పోటీ చేసే వాళ్ళు తమ ప్రచారం ముగిసిపోవడంతో 7 వ తేదీ జరగబోయే ఎన్నికలపై దృష్టి సారించారు.. టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు మరియు మహాకూటమి అభ్యర్థులు పోటాపోటీగా కలబడుతున్నారు తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో మరి కొద్దీ రోజుల్లో తెలిసిపోతుంది.. తెలంగాణ ప్రచార కార్యక్రమాలలో అందరు తమ వంతు కృషి తాము చేశారు చివరికి వాళ్ళు అనుకున్నది సాధిస్తారో లేక అన్ని తారుమారు అవుతాయో చూడాలి..

తెలంగాణ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి..


Spread the love