రజనీకాంత్ రోబో 2.0 రిలీజ్ ఆగినట్టేనా

Spread the love

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించగా తెరకెక్కిన చిత్రం  రోబో 2.0 ఈ సినిమా పై అనేక అంచనాలు నెలకొన్నాయి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లు ప్రెస్ మీట్ లు పూర్తి చేసుకొని ఈ నెల న విడుదలకు సిద్ధమైన రోబో 2.0 పై షాకింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది..ఎంతో అత్యున్నత విలువలతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..

మొబైల్ కమ్యూనికేషన్స్ పై ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే,అయితే దీనిపై సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం సెన్సార్‌బోర్డు ఫిర్యాదు చేయ‌డంతో సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది..ఈ సినిమాలో మొబైల్‌ ఫోన్‌, టవర్లు, మొబైల్‌ సేవలకు వ్య‌తిరేకంగా.. చిత్ర దర్శకుడు,నిర్మాతలు ప్రచారం చేశారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు..

ఇప్ప‌టికే విడుద‌లైన రోబో 2.0 ట్రైలర్స్‌లో సెల్ ఫోన్ వాడకంపై ప్రజల్లో భయాందోళనలు కలిగించేవిధంగా ఉన్నాయని, సైన్స్ అండ్ టెక్నాలజీని తప్పుపడుతూ, టెలికాం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.చిత్ర యూనిట్ స్పందించే వరకు సినిమాని విడుదల కానివ్వమని టెలికం ఆపరేటర్లు ఆందోళన మొద‌లుపెట్టారు.దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

 


Spread the love