కే.టి.ఆర్ ని కలిసిన కొద్దిసేపటికే కుప్పకూలిన టీఆర్ఎస్ అభ్యర్థి

Spread the love

తెలంగాణలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతుంది ప్రతి ఒక్క అభ్యర్థి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ప్రచార కార్యక్రమాలలో మునిగిపోతున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు..

ఒక పాక ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్లతో అదే పార్టీ వాళ్ళు వేరే గ్రూపు వాళ్ళతో గొడవలు చేసుకుంటూ తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది..ఈ పరిణామాలతో కొందరు అభ్యర్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.. ఈ కోవలోకి ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ గారు నిన్న తెలంగాణా మాజీ మంత్రి కె టి ఆర్ ని కలిసేందుకు ఆయన ప్రగతి భవన్ కి వెళ్లారు..

టి ఆర్ ఎస్ నుండి టికెట్ ఆశించి దక్కించుకోలేని ఇండిపెండెను అభ్యర్థి ప్రఫుల్ రెడ్డి బుజ్జగించడానికి వెళ్లిన ఈయన చర్చలు జరిపారు.. కొద్దిసేపటికి భోజనం చేసాక మాట్లాడదాం అని కె టి ఆర్ చెప్పగా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్ కి వెళ్లిన ముఠా గోపాల్ ఎంతసేపటికి రాకపోయేసరికి కార్యకర్తలు వెళ్లి చూడగా అక్కడ పడిపోయి ఉండటాన్ని గమనించారు..

వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్ కి తరలించారు ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు..ఇలా చాల మంది అభ్యర్థులు వారికి అస్వస్ధ వున్నా కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇంత చేసాక కూడా వాళ్ళు గెలవకపోతే వారు చేసే వ్యయ ప్రయాసలు వృధా అయిపోతాయని అందరు భావిస్తున్నారు..


Spread the love