జైలుకు వెళ్లనున్న హరీష్ రావు షాక్ లో టి.ఆర్.ఎస్

Spread the love

ప్రచారం లో భాగంగా ఎంతో ఉత్సహంగా పాల్గొన్న హరీష్ రావు కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ఎన్నికల ప్రచార భాగం లో పలువురు నేతలు కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు . అయితే ఎన్నికల నియమావళిని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఉల్లంగించారు..

నిన్న సిద్ధిపేటలో ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆశీర్వాద సభకు మంత్రి హరీష్ రావు హాజరై విరాళాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి..ఎన్నికల వేళా పలువురు కీలక నేతలు కు ఇబ్బందులు తప్పడం లేదు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు హరీష్ రావు ఆశీర్వాద సభ పేరుతో విరాళాలు సేకరించారు అని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

ఆశీర్వాద సభ పేరుతో ఒక కులానికి ప్రధాన్యత ఇవ్వడం సబబు కాదని కొన్ని వర్గాల నేతలు ఆరోపించారు .
ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తే చర్యలు తప్పవని ఈసీ పేర్కొంది .హరీష్ రావు అలా చేయడానికి గల కారణాలు లభించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకొని, ఇతరత్రా ఆధారాలు పరిశీలించి తరువాత హరీష్‌ రావు పై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారికి ఈసీ సూచించింది.

ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జయచంద్రారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.మంత్రిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదైందని సీఐ వెల్లడించారు…


Spread the love