రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసింది అసలు పోలీసులేనా

Spread the love

కొడంగల్ ప్రజల పై రెచ్చిపోతున్న పోలీసుల బొమ్మరాస్ పేటలో 144 సెక్షన్ విధించారు..తన భర్త కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని టెర్రరిస్ట్ ని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య ఆరోపించారు.
కెసిఆర్ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి ని ముందస్తుగా అరెస్ట్ చేశారు..తలుపులు బద్దలుకొట్టి మరి తెల్లవారుజామున రేవంత్ ఇంటికి వచ్చిన పోలీసులు రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు.

కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలని పిలుపు నివడంతో ఆయన్ను అర్ధరాత్రి వేళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ్ళ కొడంగల్ లో తెరాస ప్రజా ఆశీర్వాద సభ లో కెసిఆర్ పాల్గొంటున్న సందర్భంగా కెసిఆర్ ను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు.

దీంతో ముందు జాగ్రత్త గ కొడంగల్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు . ఎలాంటి నిరసనలకు అనుమతులు లేవని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కొడంగల్ కు అదనపు బలగాలను తరలించారు . ఈ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డి ని ముందస్తు గా అరెస్ట్ చేసారు .

రేవంత్ రెడ్డి భార్య మీడియా తో మాట్లాడుతూ కొడంగల్ ప్రజల పై దాడులకు ఇది కొనసాగింపు . ఇలాంటి చర్యలు జరుగుతాయని తెలుసు కానీ మరి ఘోరంగా టెర్రరిస్ట్ ని తీస్కెళ్లినట్టు టెస్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేసారు.

అస్సలు తీసుకెళ్లింది పోలీసులేనా అని విచారం వ్యక్తం చేసారు తన భర్త ను ఎక్కడ కు తీస్కెళ్ళారో కనీసం వివరాలు కూడా చెప్పడంలేదని బాధపడ్డారు. ఎప్పుడుపడితే అప్పుడు పోలీసులు ఇళ్లలోకి ప్రవేశించే హక్కు రాజ్యాంగం పోలీసులు కు ఇచ్చిందా అని పోలీసులని ప్రశ్నించారు .

ప్రజా స్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ఎవరికైన ఉందని నిరసన తెలుపుతారని భయపడి ముందస్తు అరెస్ట్ లు చేయడం నీచమైన చర్య అని కెసిఆర్ రేవంత్ ని చూసి భయపడుతున్నాడని ఇది తెలంగాణ బిడ్డ పై జరుగుతున్న దాడి అని ప్రజలు తమ ఓటు ద్వారా కెసిఆర్ కి బుద్ధి చెప్పాలని కోరారు..


Spread the love