బంగారు తెలంగాణ దీక్ష దివస్ కి 9 ఏళ్ళు

Spread the love

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే సి ఆర్ బంగారు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేపట్టి 9 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా కొడుకు కేటీఆర్ కూతురు కవిత ట్విట్టర్ వేదికగా తన తండ్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తెరాస అధినేత కెసిఆర్ దీక్ష దివస్ గురించి స్పందించారు.

బంగారు తెలంగాణ కోసం నవంబర్ 29 2009 న కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ దీక్ష దివస్ స్ఫూర్తిని జ్ఞాపకాలను పోరాటాలను పలువురు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.

కూతురు కవిత స్పందిస్తూ తెలంగాణ గతిని మార్చిన ఈరోజుని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి ప్రాణాన్నిసైతం పణంగా పెట్టి పోరాడుతున్న కెసిఆర్ ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞలు తెలిపారు .

కెసిఆర్ ఉద్యమ సమయం లో అన్ని వర్గాల వారిని కలిశారు వారి బాధలను తెలుసుకున్నారు. బంగారు తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయినా తర్వాత అంతే పట్టుదల దీక్ష తో ప్రజల కష్టాలపై పోరాడుతున్నారు . కెసిఆర్ కష్టాల ఫలితమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనదని పలువురు హర్షం వ్యక్తం చేశారు .


Spread the love