భారతీయులు గర్వపడేలా నిలిచిన రజిని రోబో 2.0

Spread the love

సూపర్ స్టార్ రజినీకాంత్ వన్ మాన్ షో గా 2.0 రూపుదిద్దుకుంది.ఈ చిత్రం అంత రజినీ తన విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు.ఈ సినిమాలో రజినీ నటన చూస్తే బాలీవుడ్ లో గానీ ఇతర ఏ హీరో లు అలా నటించలేరని ఖచ్చితంగా చెప్పగలం,రజిని కి బాగా కలిసొచ్చే అంశం అతని స్టైల్ మరియు నటన ఈరెండు కలిపి రోబో ని ఒక స్థాయిలో నిలబెట్టాడు రజిని…

ఇక రోబో లో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్ విషయానికొస్తే ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే భయపెడుతుంది.ఈ పాత్రని అతను తప్ప మరెవ్వరూ పోషించలేరు అన్నంతగా ఒదిగిపోయాడు.

ఈ సినిమాతో అక్షయ్ కుమార్ ప్రేక్షకులని మాయ చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఇక అమీ జాక్సన్ విషయానికొస్తే తన అందం తో నటనతో అద్భుతంగా కనిపించి మంచి మార్కులే కొట్టేసింది..

మ్యూజిక్ మాంత్రికుడు A.Rరెహ్మాన్ మరోసారి తన సత్తా చాటాడు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎఫెక్ట్స్ కి సరిపోయే విధముగా తన బాణీలు అందించారు..అద్భుతమైన కథ కథనాలతో మొబైల్ ఫోన్ ల నేపధ్యంగా ఆండ్రాయిడ్ విప్లవం అనే కథతో శంకర్ రోబో ని నిర్మించాడు..

ఈ సినిమాలో ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా ఉంటుంది యాక్షన్ సీన్స్ మరియు VFX లు ఇప్పటి వరకు సినీ ప్రేక్షకుడు చూడని విధంగా దర్శకుడు శంకర్ ఈ సినిమాని రూపొందించాడు..ముఖ్యంగా రజినీకాంత్, అక్షయ్ కుమార్ పాత్రలు ఈ సినిమాకి వెన్నెముగా నిలిచి సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి.

భారతీయ సినిమా లోకానికే రోబో 2.0 గర్వకారంగా మారే చిత్రం గా నిలుస్తుంది.భారతీయ చలన చిత్ర రంగంలోని ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని సైన్టిఫిక్ చిత్రంగా ఈ సినిమా చరిత్రలో నిలబడిపోతుంది..ఇక పై వచ్చే ప్రతి రోబోల కథకు ఈ సినిమా ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది.

ఈ సినిమాతో దర్శకుడు శంకర్ ఇండియా లోనే బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం ఖాయం.శంకర్ డైరెక్షన్ గురించి అందరికి తెలిసిందే అతని ప్రతిభ, మూవీ టేకింగ్ కథను తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే ఆర్చర్యానికి గురిచేస్తాయి.

 

Galipatam Rating: 3.5/5


Spread the love