3D గ్లాసెస్ లేకుండ 3D సినిమా..RRR తో రాజమౌళి రికార్డు

Spread the love

రాజమౌళి బాహుబలి వంటి గాని విజయం తర్వాత తన తరువాతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..

రామ్ చరణ్, తారక్ వంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమా చేయాలంటే వాళ్లకి తగినట్టుగానే సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ వుండాలనుకున్నాడు.. మన జక్కన్న అంతే ఇక ఆలస్యం చేయకుండా 3డి టెక్నాలజీ ఉపయోగించే కెమెరాలని అలాగే ఇది 3డి సినిమా కాకపోయినా ఆ ఫీలింగ్ వచ్చేలా ఉండటానికి విదేశాలనుండి ప్రత్యేకమైన కెమెరాలని తెప్పించాడట జక్కన్న..

 

ఈ కెమెరాల‌తో 360 డిగ్రీస్ లో సీన్స్ చిత్రీక‌రించ‌వ‌చ్చు. ఇక ఈ చిత్రంలో 4D రోబాటిక్ టెక్నాలజీని వాడి సుమారు 120 కెమరాలతో యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు రాజ‌మౌళి. దానికోసం కెమెరామెన్ సెంథిల్ కుమార్ కూడా చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

ఇండియ‌న్ సినిమాలో ఇలాంటి ప్ర‌యోగం చేస్తున్న‌ది తొలిసారి ఈ చిత్రం కోసమే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ చివరిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోస‌మే సిబిఐటి స‌మీపంలో భారీ సెట్ ఒక‌టి వేస్తున్నారు. అందులోనే దాదాపు మూడు నెల‌లు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి.


Spread the love