RRR స్టోరీ లీక్ షాక్ లో రాజమౌళి

Spread the love

జక్కన్న మల్టీస్టారర్‌ గా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.రామ్ చరణ్, తారక్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే..నిర్మాత DVV దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..అసలే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా అన్ని చోట్ల లీక్ ల భయం పట్టుకుంది ఏ సినిమా ఎప్పుడు లీక్ అవుతుందో అని అందరు భయానికి గురవుతున్నారు..

అలాగే మన జక్కన్న తెరకెక్కిస్తున్న RRR గురించి కూడా ఒక వార్త హల్ చల్ చేస్తుంది.. రాజమౌళి సినిమా అంటేనే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది బాహుబలి వంటి సినిమాని రాజుల కాలంలో చాలా చక్కగా రూపుదిద్దాడు.. ఇప్పుడు జక్కన్న తెరకెక్కించబోతున్న RRR కి కూడా ఒక ప్రత్యేకత ఉందట,ఈ సినిమా స్వాతంత్రానికి ముందు జరిగే నేపధ్యం లో సాగే సినిమా అని మనకు తెలిసిన విషయమే, కానీ చెర్రీ, తారక్ వంటి అగ్ర కథానాయకులు ఉన్నటువంటి ఈ సినిమాలో ఎవరి పాత్రని తక్కువ చేయలేము..

అలాంటిది వీళ్లిద్దరికీ ఎటువంటి పాత్రలు లభిస్తాయో అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అంశం బయటికొచ్చింది..ఈ సినిమాలో తారక్ బందిపోటుగా కనిపించి కనువిందు చేయగా, చెర్రీ మాత్రం బ్రిటిష్ వారి దగ్గర సైనికా దళంలో రక్షణాధికారిగా అలరించబోతున్నాడు..

మొదట వీరిద్దరికి వైరం మొదలవగా కాల క్రమేణా వీరివురు కలిసిపోయి బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొడతారట.. రాజమౌళి ఏం చేసిన అందులో ఒక అర్ధం ఉంటుంది అలాగే ఈ మల్టీస్టారర్ లో కూడా ఈ అగ్ర కథానాయకులకు సరిపోయే పాత్రలని ఎంచుకున్నాడని అందరు భావిస్తున్నారు..


Spread the love