మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పై స్పందించిన రాహుల్ గాంధీ

Spread the love

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో మొదలైన గందరగోళం చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరికలు.తెలంగాణ కాంగ్రెస్ లో చాల మంది సీనియర్ నాయకులూ ఉండటం తో ముఖ్య నేతలు ముఖ్యమంత్రి పదవి ప్రకటన పై ఆశలు పెట్టుకున్నారు.

ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ని ఢిల్లీ నుంచి వచ్చే షీల్డ్ కవర్ నిర్ణయించనుందా వీటికి సమాధానం అంత సులభంగా తెలిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుంది అంటున్న విశ్లేషకులు .మహాకూటమి నిర్వహించిన మీడియా సమావేశం లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏవరు అనేది ఇప్పుడే చెప్పలేము అని ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటన ఉండబోతుందని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలను ఉద్రిక్తతకు గురిచేసారు..

కేంద్రంలో మోడీ ని తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ ని అధికారం నుంచి అవుట్ చేయడమే మహాకూటమి లక్ష్యమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కెసిఆర్ నరేంద్ర మోడీది చీకట్లో దోస్తీ అని ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలకు అర్ధమవుతుందని తెలంగాణ మహాకూటమి గెలిచినా వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.

మహాకూటమి లక్ష్యమే తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుపడే ప్రజకూటమి అని ఓటర్లు తమ ఓటు ను సద్వినియోగం చేసుకొని రాక్షస పాలనకు స్వస్తి పలకాలని కోరారు.మహాకూటమి ఎన్నికల తర్వాత కూడా కలిసే ఉంటుందని స్నేహ భావంతో ప్రజలకు మంచి చేసే పనులు కలిసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు .
ఈ సమావేశం లో మహాకూటమి నేతలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ,కాంగ్రెస్ సీనియర్ నేతలు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మందకృష్ణ మాదిగ ,సిపిఐ సిపిఎం నేతలు పాల్గొన్నారు


Spread the love