రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రచార సభ

Spread the love

తెలంగాణ ఎన్నికల ప్రచార భాగం చివరి దశకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాలు జోరందుకున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలతో పటు జాతీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొననున్నరు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన తదుపరి షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికల ప్రచారం లో భాగంగా కూకట్ పల్లి ,జూబ్లీహిల్స్,ముషీరాబాద్,ఖైరతాబాద్ లో పాల్గొననున్నారు .

ఈ మేరకు మహాకూటమి లోని కాంగ్రెస్ సీనియర్ నేత మరియు రాజ్యసభ ప్రతిపక్ష నేత అయినా ఆజాద్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి పలు ప్రాంతాలలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు గారి తో కలిసి కూకట్ పల్లి , జూబ్లీహిల్స్ లో రోడ్‌షో నిర్వహించి మహాకూటమి నేతలు , కార్యకర్తలు,అభిమానులను కలవనున్నారు..

ఈరోజు రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తున్నా సందర్భంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి బేగంపేట ఫ్లై ఓవర్, శ్రీనగర్‌ టీ-జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4.15 గంటలకు జూబ్లీహిల్స్‌, 5.30 గంటలకు కూకట్‌పల్లి రోడ్‌షోలో రాహుల్ పాల్గొన్నారు..


Spread the love