NTR బయోపిక్ లో అదరగొట్టబోతున్న RX 100 అందాల తార పాయల్ రాజపుత్

Spread the love

బాలయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా NTR బయోపిక్.. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాని పార్టులుగా విభజించి సంక్రాంతికి మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మరియు జనవరి న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకి సిద్ధం చేస్తున్నారు..

ఆయన నట జీవితంలో భాగమైన అనేకమందిని దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో చూపించబోతున్నాడు.డిసెంబర్ లో ఈ సినిమా ఆడియో వేడుకని తిరుపతి లో నిర్వహిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటిస్తున్న విషయం తెలిసిందే, ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ టాప్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, సుమంత్, రానా ఇలా చాలామంది నటిస్తున్నారు.

వాళ్ళ కోవలోకే మరో హాట్ బ్యూటీ చేరింది తాను ఎవరో కాదు కుర్రాళ్ళ హృదయాల్ని 100 వేగంతో కొట్టుకునేలా చేసిన అందాల భామ RX 100 హీరోయిన్ పాయల్ రాజపుత్..ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో పార్ట్ అవ్వబోతుంది.పాయల్ రాజపుట్ ఎన్టీఆర్ బయో పిక్ లో సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ పాత్రలో కనిపించబోతుంది. ఎన్టీఆర్ నట జీవితంలో డ్రైవర్ రాముడు , గజదొంగ , మహా పురుషుడు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో జయసుధ ఎన్టీఆర్ కి జోడిగా నటించింది.

అందుకే ఈ సినిమాలో జయసుధ పాత్రని కూడా హైలెట్ చేయబోతున్నాడట క్రిష్. ఇక ఆ పాత్ర కోసం పాయల్ రాజపుట్ ని తీసుకుంటున్నాడట క్రిష్. ఈ సినిమా విజయం సాధిస్తే ఈ భామ ని అందుకోవడం కష్టమే అవుతుంది.. ఇప్పటికే రవితేజ హీరో గా ఈ హాట్ బ్యూటీ ఒక సినిమాలో నటిస్తుంది..


Spread the love