అర్ధం చేసుకుంటే కోపం కూడా అర్ధవంతమైనదే!

Spread the love

మనిషికి కోపం అనేది ఒక ఎమోషన్. బాధ, సంతోషం, ప్రేమ మొదలగునవి ఉన్నట్లు కోపం కూడా ఒకటి. కోపం అనేది సహజంగా మనుషులకే కాక ప్రతిజీవికి వుంటుంది. కేవలం దానిని వ్యక్తపరచటంలో బేధం వుంటుంది.కోపం అనేది మనకు నచ్చనిది జరిగినప్పుడు, మనం కరెక్ట్ అవతలి వాళ్ళు తప్పు అనుకోవడం వల్ల కలిగే ఒక భావోధ్వేగం.

The Intensity of anger depends on level of EGO.

కోపం తీవ్రత అనేది మనకున్న ఇగో లెవెల్ మీద ఆధార పది ఉంటుంది. ఇగో అంటే నా, నేను, నాకు, నాది అనే ఒక భావన. నన్ను అన్నాడు, నేను చెప్పిన మాట వినలేదు, నాకు ఫలానాది ఇవ్వలేదు, నాది తీసుకున్నాడు, నా టైం వేస్ట్ చేస్తున్నాడు ఇలాంటి ఎన్నో కారణాలు వల్ల మనకు కలిగే భావోద్వేగం నే కోపం అంటారు. సహజంగా కోపం యొక్క తీవ్రత బలవంతుడి పై కన్న బలహీనుడిపై ఎక్కువగా ఉంటుంది. మనకన్నా బలవంతుడు మనకు ఎదురు పడితే మనకు వాడిపై ఉన్న కోపం యొక్క తీవ్రత భయం చేత తగ్గిపోతుంది.

ఈ బలం అనేది ఏ రూపంలోనైనా ఉండచ్చు, అది డబ్బు పరం గా గాని, శారీరకంగా గానీ, మానసికంగా గానీ, పలుకుబడితో గాని ఉండవచ్చు. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులకు గొడవ జరిగినపుడు అవతలి వ్యక్తికి నలుగురు స్నేహితులు జత అయితే మరొక వ్యక్తి యొక్క కోపం తీవ్రత భయం తో తగ్గుతుంది. కోపం వచ్చినపుడు మనిషి ఆలోచనా శక్తి క్షీణిస్తుంది అందుకే మన సమాజములో చాల తప్పులు కోపం లో ఉన్నప్పుడే జరిగిపోతాయి. కోపం తగ్గాక వాళ్ళు చేసింది తప్పు అని తెలిసి బాధపడతారు. చాలా మంది ఇర్రిటేషన్ ని కోపం అని అనుకుంటు ఉంటారు. ఇర్రిటేషన్ కి కోపం కి చిన్న బేధం వుంది. అది ఏమిటి అంటే ఒక మనిషి దేనివల్ల, ఎవరివల్ల అయితే ఇర్రిటేషన్ కి గురవుతారో దాని నుండి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తారు. కానీ కోపం వచ్చినపుడు ఎటువంటి ఆలోచన లేకుండా కొట్టడం కానీ అరవడం కానీ చేస్తారు ..కోపం రావటానికి ముఖ్య కారణం మన ఇగో. అయితే దానికి తోడ్పడేది మనకి ఏ విషయం పై కోపం వచ్చిందో దానిపై అవగాహన లేకపోవడం. కోపం అన్నది మనం బలహీనంగా వున్నప్పుడు వచ్చే ఒక భావన. బలహీనత అనేది మానసికంగా కానీ, శారీరకంగా కానీ అవ్వచ్చు. మానసికంగా , శారీరకంగా బలంగా వుండే వారికి కోపం తక్కువ లెవెల్ లో ఉంటుంది. మనకు కోపం వచ్చినపుడు ఆ కోపం ఎందుకు, దేనివల్ల , ఎవరివల్ల , వచ్చింది అనేది అలోచించి అనలైజ్ చేస్తే సగం కోపం తగ్గుతుంది.

 

భావోద్వేగాలు సంపూర్ణంగా ఒక వ్యక్తి స్వభావానికి సంబందించినవి. అవి ఒకరు పుట్టించేవి కావు. కేవలం మనలో ఉన్న భావోద్వేగాలు యొక్క తీవ్రతని పెంచటం గాని తగ్గించడం గాని చేయగలరు. కానీ మనం వాడివల్ల కోపం వచ్చింది అని ఒకరి పై తోసి మన ఇగో ని satisfy చేసుకుంటాం. మనలో ఉన్న అహాన్ని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నాశనం చేయగలమో అప్పుడు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు.

Article Written By: GORANTLA RAJESH

for Gorantla More Updates Watch This Link- https://www.facebook.com/gorantla.r.kumar


Spread the love