తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’ గా రానున్న సైరా అందాల తార.

Spread the love

నయనతార ఇప్పుడు ఎంత బిజీ గ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ, రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైరా సినిమా కోసం తక్కువ డేట్స్ ఇచ్చిందంటే నయన్ ఎంత బిజీ గ ఉందొ తెలిసిపోతుంది నిన్న నయన్ పుట్టిన రోజు సందర్బంగా సైరా చిత్ర బృందం నయన్ ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకి మంచి కిక్ ఇచ్చారు..

ఇదిలా ఉండగా నయనతార తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా ఫుల్ బిజీ గ వుంది.. అయితే నయన్ తమిళ్ సూపర్ హిట్ కొట్టిన చిత్రం ‘ఇమైక్కా నొడిగళ్’ ఇదే చిత్రాన్ని తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’ గా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో ‘ అంజలి విక్రమాదిత్య’ టైటిల్ ని ఖరారు చేసారు.. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నా లు ప్రధానపాత్రలు పోస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధిపాత్రలో మెరవనున్నారు..

తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, RD రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

తారాగణం: నయనతార, అధర్వ, రాశి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: ఆర్. అజయ్ గనన్ముత్తు
నిర్మాతలు: సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్
బ్యానర్: విశ్వశాంతి క్రియేషన్స్
సంగీతం:హిప్ హాఫ్ తమిళ
సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్


Spread the love