హైదరాబాద్ పై పెట్టుకున్న చివరి ఆశలు ప్రధాని నెరవేర్చేనా..!

Spread the love

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.తెలంగాణ లో మరోసారి బారి సభ లో పాల్గొననున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరగనుకున్నబీజేపీ సభ కు కాషాయదళం ప్రతిష్టాత్మకం కానుంది . నరేంద్ర మోడీ ప్రసంగం ప్రధానం గా కాషాయదళం ను ఆకట్టుకోనుంది . ఈరోజు జరగనున్న సభ కు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా ,మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ పర్యవేక్షిస్తున్నారు.

సుమారు 40 మంది కీలక నేతలు సభ లో పాల్గొననున్నారు. సభ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు రంగారెడ్డి జిల్లా లో ప్రజలను సమీకరించి అక్కడ నుండి ఎల్బీ స్టేడియం కు తరలించనున్నారు.
ఒక పక్క తెరాస ప్రచారం లో దూసుకుపుతుండగా, మరోపక్క మహాకూటమి తామేమి తక్కువ కాదనట్టుగా అగ్ర నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

గతంలో బీజేపీ గెలిచిన 5 స్థానాలు హైదరాబాద్ లోనే ఉండటంతో తెలంగాణ బీజేపీ నేతలు మోడీ సభకై ఎదురుచూస్తున్నారు .మొన్న జరిగిన నిజామాబాద్ సభ లో ప్రధాన మంత్రి మోడీ కాంగ్రెస్ మరియు తెరాస ను దుమ్మెత్తిపోశారు.బంగారు తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం అని మహాకూటమి ఓ అయోమయ కూటమి అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు.సభ అనంతరం ప్రధాని మోడీ ఢిల్లీ కి తిరుగు ప్రయాణం కానున్నారు .

నగరంలోని పలు నియోజకవర్గాల్లో స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేశారు. పాతబస్తీలోనూ ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తుండడంతో ఈసారి ఎన్నికల హోరు ఆసక్తికరంగా మారింది.గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి మోదీ ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు.


Spread the love