సుహాసిని కి మద్దతుగా ప్రచారం చేసిన నందమూరి హీరో భార్య

Spread the love

మహాకూటమి లోని టీడీపీ అభ్యర్థి గా కూకట్ పల్లి నియోజకవర్గం లో పోటీచేస్తున్న నందమూరి సుహాసిని కి మద్దత్తు గా నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి భగత్ సింగ్ నగర్, వసంత నగర్ లో విస్తృతంగా ప్రచారం చేసారు. నందమూరి వారసురాలు అయినా నందమూరి స్వాతి తన వదిన నందమూరి సుహాసిని కి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కూకట్ పల్లి నగరవాసులను కోరారు.

రాధికా రెడ్డి సమక్షంలో నందమూరి సుహాసిని ని ఘనంగా సన్మానం నిర్వహించారు. సన్మానం అనంతరం 300మంది తెరాస కార్యకర్తలు టీడీపీ లో చేరారు.కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని కనక దుర్గమ్మ ఆలయం లో నందమూరి సుహాసిని కి విజయం చేకూరాలని శ్రీ శక్తీ మహిళా మండలి అద్వర్యం లో ప్రత్యేక పూజలు చేసారు.

నందమూరి సుహాసిని స్పందిస్తూ నందమూరి వారసురాలిగా సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చాను అని పేర్కొన్నారు. నాన్న హరికృష్ణ , తాతయ్య నందమూరి తారక రామారావు , మామయ్య చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానని ప్రజాసేవ చేసేందుకు నందమూరి కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌ వరకు నిర్వహించిన రోడ్ షో లో నందమూరి సుహాసిని ఉత్సహంగా అభివాదం చేస్తూ ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు .కార్యక్రమంలో గొట్టిముక్కల పద్మారావు, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, మాధవరం సుదర్శన్‌రావు, విద్యా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Spread the love