BJP కి TRS మద్దతు అందుకే అలా చేయాల్సివచ్చింది

Spread the love

తెరాస తో ఎంఐఎం దోస్తీ కొనసాగుతుంది అని సభ లో ప్రస్తావించిన ఎంఐఎం చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ. తెరాస ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ ల గురించి పోరాడుతున్న విషయం తేలిసిందే. గతం లో అసెంబ్లీ లో ముస్లిం రిజర్వేషన్ ల ను అడ్డుకున్న బీజేపీ నాయకులు , ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీ ప్రజలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని కెసిఆర్ పలు సభల్లో చెప్పి ముస్లిం ప్రజలకు మాటిచ్చారు.

తాము తెరాస కు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ బలపడుతుంది అని కావున తెరాస కు మద్దత్తు కొనసాగింపు ఉంటుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్వష్టం చేసారు . మొన్న జరిగిన బీజేపీ సభ లో పలువురు ముఖ్య బీజేపీ నేతలు ఎంఐఎం నేతలను తెలంగాణ నుంచి తరిమి వేయాలని పిలుపునిచ్చారు.

ఆ విషయమై స్పందిస్తూ బీజేపీ పై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ని కేంద్రం నుంచి గద్దె దింపండమే తమ లక్ష్యమని ఎంఐఎం నేతలు పేర్కొన్నారు.‘‘టీఆర్ఎస్ మజ్లిస్‌ ఉందని కొందరు అంటున్నారు. నిజమే ఆ పార్టీకి మేం మద్దతు ఇస్తున్నాం. ఎందుకిస్తున్నామో మాకు తెలుసు మద్దతిచ్చే ధైర్యం మాకు ఉంది.. దీని వెనుక ఓ వ్యూహం కూడా ఉంది. మేం వదిలేస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి దగ్గరవుతుంది.

అదే జరిగితే.. తెలంగాణలోనూ బీజేపీ బలోపేతమై అధికారంలోకి వస్తుంది. అది మాకు ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎ్‌సకు ఎందుకు మద్దతిస్తున్నామో అందరికి అర్థమైంది కదా? అంటూ జనసందోహాన్ని ఉద్దేశించి అక్బర్‌ పై విదంగా స్పందించారు..


Spread the love