ట్యాక్సీవాలా చిత్రానికి చిరు అభినందనలు

Spread the love

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ట్యాక్సీ వాలా ఈ సినిమా ఘన విజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.. ఈ సినిమా ముందుగానే లీక్ అయిన ఈ చిత్రం ఘన విజయం వెనుకు ఉన్న చిత్ర బృందాన్ని మెగా స్టార్ చిరంజీవి గారు ప్రత్యేకంగా అభినందించారు..

ఈ చిత్రానికి దర్శకత్యం వహించిన రాహుల్ సంకృత్యన్ చిరంజీవి ప్రశంసలతో ముంచేతాడు.. ఇలాంటి విజయవంతమైన చిత్రాలు మరెన్నో ఈ ఇండస్ట్రీ కి రావాలని మెగాస్టార్ పేర్కొన్నారు..

నిర్మాత ఎస్ కె ఎన్ మాట్లాడుతూ అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. టాక్సీవాలా చిత్రం ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు మా చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం మరింత బలాన్నిచ్చింది.


Spread the love