RRR తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్,అఖిల్

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాతో చెర్రీ చాలా బిజీ గా ఉన్నాడు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న వినాయ విధేయ రామ లో కూడా చెర్రీ నటిస్తున్నాడు ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు..

రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం మనకు తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్ మొదలు పెట్టాక చెర్రీ తన తండ్రి మెగాస్టార్ తో ఖైది no.150 సినిమా తీసి నిర్మాతగా కూడా నిరూపించుకున్నాడు..

ఇప్పుడు మళ్ళి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 151 వ చిత్రం సైరా కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఇక విషయానికొస్తే అక్కినేని వారసుడు అఖిల్ కి ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతున్నాడు.

ప్రస్తుతానికి అఖిల్ మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటిస్తున్నాడు.అఖిల్ ఈ సినిమాని పూర్తి చేయగానే రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడట, వినయ విధేయ రామ తర్వాత చెర్రీ మళ్ళి బోయపాటి తో కలిసి పని చేయాల్సి వస్తుంది.ఈ సినిమాపై అటు మెగా ఫ్యామిలీ ఇటు అక్కినేని ఫ్యామిలీ స్పందిచాల్సి వస్తుంది..


Spread the love