ప్రేక్షకుల ముందుకు రాజన్న వచ్చే టైమొచ్చేసింది

Spread the love

దివంగత మాజీ ముఖ్యమంత్రి , ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ ను డైరెక్టర్ మహి వీ రాఘవ దర్శకత్వంలో శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గతం లో విడుదలైన టీజర్స్ కు మంచి స్పందన లభించింది. యాత్ర సినిమా ను ప్రారంభించినప్పటినుంచే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, తమ నాయకుడి జీవిత కథను ఎప్పుడు తెరపై చూద్దామ అని అలాగే ఆయన ప్రారంభించిన యాత్ర ను కనులార మరోసారి చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

చిత్ర యూనిట్ కూడా ఇక ఆలస్యం చేయదలచుకోలేదు, ఏదో ఒక రూపం లో ప్రేక్షకులకు దగ్గరయ్యే పని లో పడ్డారు.ఇప్పటికే యాత్ర సమార శంఖం, రాజన్న నిన్నుఅపగలరా అనే ప్రోమో వీడియో సాంగ్స్ ను విడుదల చేసారు . సాంగ్స్ కు విశేష స్పందన లభిస్తుంది. అయితే చిత్ర యూనిట్ ప్రజలకు మరో కనుక ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు సాయంత్రం యాత్ర సినిమా ట్రైలర్ ను 5 గంటలకు విడుదల చేస్తామని పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ . వై ఎస్ ఆర్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు .


Spread the love