కే.టి.ఆర్ ట్వీట్ పై లగడపాటి రియాక్షన్ అదిరింది

Spread the love

లగడపాటి తెలంగాణపై ఇచ్చిన సర్వేని చంద్రబాబునాయుడు ఒత్తిడితో అంకెలు మార్చి వెల్లడించారు అని కె టి ఆర్ లగడపాటిపై ధ్వజమెత్తారు. జరిగిన కుట్ర బయటపెట్టేందుకే ఈ చాట్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా’’ అంటూ కేటీఆర్ ఒక ట్వీట్ ని విడుదల చేసైనా విషయం తెలిసిందే..

అస్సలు విషయానికి వస్తే ఎన్నికల సర్వే అనగానే గుర్తొచ్చే పేరు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. లగడపాటి రాజగోపాల్ ని ముద్దుగా ఆంధ్ర ఆక్టోపస్ అని పిలుస్తుంటారు వారి శ్రేయోభిలాషులు.గత నెలలో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే పేరుతో నాకు మెసేజ్ పంపారు అని కేటీఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా  మెసేజ్ ను షేర్ చేసారు.

తెరాస కు 70 సీట్ల వరకు వస్తాయని హ మెసేజ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్ స్పందిస్తూ లగడపాటి పై చంద్రబాబు ఒత్తిడి ఉందని దాని వలెనే లెక్కలు తారుమారు అయ్యాయి అని ఇది ఆక్టోపస్ సర్వే కాదని చిలక జోస్యం అన్నారు.
కేటీఆర్ వాక్యాలు పై లగడపాటి విరుచుకుపడ్డారు.

కేటీఆర్ నే తనను సర్వే కోరారు అని ఈ సర్వే ఉచితంగా చేశాను అని చాల చోట్ల తెరాస అభ్యర్థులకు వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లితుందని ముందుగానే కేటీఆర్ ను హెచ్చరించాను అని అయిన మీడియా మిత్రులకు వివరాలు వెల్లడించారు.


Spread the love