టి.ఆర్.ఎస్, మహాకూటమికి రెబెల్స్ షాక్ లగడపాటి సంచలన కామెంట్స్

Spread the love

గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపు దిశగా ఉన్నారు అని లగడపాటి అన్నారు . ఈసారి జరగబోతున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించబోతున్నట్లు లగడపాటి తెలిపారు .

ఈరోజు నుంచి దశల వారీగా గెలుపు దిశగా ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తాను అంటున్న లగడపాటి . ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు నీతి నిజాయితీ కలిగిన నాయకులని ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు .

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న వారి లో కాంగ్రెస్ రెబెల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం కి చెందిన స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గ అభ్యర్థి శివకుమార్ రెడ్డి గెలుస్తారని తెలంగాణ ప్రజలు కూడా కచ్చితంగా వీరికే పట్టం కడుతారని లగడపాటి హర్షం వ్యక్తం చేశారు..

తెలంగాణ ప్రజలు ప్రలోభాలకు తలొగ్గడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం సంతోషకరమని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు.స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి ఇంత ఖచ్చితంగా ఎందుకు గెలుస్తారని చెప్తున్నారో ఎవరికి అర్ధం కావట్లేదు ఏదేమైనా ఈసారి తెలంగాణా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నా సమయంలో లగడపాటి రాజగోపాల్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసి మరింత ఆలోచనాలకి తెరలేపాడు..


Spread the love