రేవంత్ పై కెసిఆర్ పొలిటికల్ పంచ్

Spread the love

కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సభ సజావుగా సాగింది . పాలమూరు జిల్లా బాగుపడాలి అంటే దరిద్రులని జిల్లా నుంచి పాలద్రోలాలని తెరాస ను గెలిపించి తెలంగాణ ద్రోహుల కు బుద్ది చెప్పాలని కెసిఆర్ అన్నారు . సభ ను చూస్తుంటే పట్నం నరేందర్రెడ్డి గెలిచి తీరుతారని కెసిఆర్ నమ్మకం వ్యక్తం చేసారు .

కొడంగల్ నియోజక వర్గ సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మహాకూటమి ధగ కూటమి అని వారిని గెలిపిస్తే చంద్రబాబు ని గెలిపించినట్టే అని ఆరోపించారు . మహబూబ్ నగర్ జిల్లా లో అభివృద్ధి ని చుసిన ప్రజలు జరగబోయే ఎలక్షన్స్ లో 14 సీట్లకు గాను 14 సీట్లు గెలిచి తీరుతామని చెప్పారు .ప్రజలలో మార్పు వచ్చిందని వాస్తవాలు గమనిస్తున్నారని ఎలక్షన్ లో గాలి ఓట్లు వేయొద్దు అని పిలుపునిచ్చారు.

కరెంటు కష్టాలు తీర్చిన పార్టీ తెరాస పార్టీ అని గతంలో ఏ రాజకీయ పార్టీ నాణ్యమైన కరెంటు సరఫరా చేయలేదని చెప్పారు . తెరాస చేసిన కల్యాణ లక్ష్మి ,కెసిఆర్ కిట్ ,మిషన్ భగీరథ పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేశారు . సభలో నీటి పారుదల సఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ బాండ శ్రీ ప్రకాష్ , ఎక్స్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పలువురు పాల్గొన్నారు.


Spread the love