NTR బయోపిక్ లో బాలయ్యకి మరో బంపర్ ఆఫర్

Spread the love

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ మొత్తం 60 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది.

ఈ సినిమా చివరి దశకు చేరుకుంది ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాని పార్టులుగా విభజించి సంక్రాంతికి మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మరియు జనవరి న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకి సిద్ధం చేస్తున్నారు..

ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటిస్తున్న విషయం తెలిసిందే, ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ టాప్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. విద్యాబాలన్,రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, సుమంత్, రానా,  పాయల్ రాజ్‌పుత్, సుమంత్ లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు హన్సికను కూడా తీసుకొని ప్రాజెక్టుకి కొత్త అందం తీసుకొచ్చాడు.

చిత్రంలో జయప్రద పాత్రలో హన్సికను తీసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ‘అడవి రాముడు, యుగ పురుషుడు’ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో చిందులేసింది జయప్రద. వీరి కాంబోలో ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి.


Spread the love