పక్షి రాజాని కాపీ కొట్టడానికి అసలు కారణం వివరించిన దర్శకుడు శంకర్

Spread the love

ఇటీవల విడుదలైన రోబో ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో అందరికి తెలిసిందే.. అందులో ఒక్కొక్కరిది ఒక్కో ముఖ్యమైన పాత్ర.. బాలీవుడ్ నుండి మొదటి సారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి పోటీగా అక్షయ్ కుమార్ నటించిన విషయం తెలిసిందే.. అందులో అతనిది ఒక ప్రత్యేకమైన పాత్ర..

శంకర్ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ డి ఒక సెన్సేషన్, ఈ పాత్ర వల్ల అక్షయ్ కుమార్ కి మంచి పేరొచ్చింది.. అసలు శంకర్ కి ఈ పాత్రని ఎందుకు సృష్టించాడో అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇప్పుడు అసలు విషయానికొస్తే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అతనే Dr. సలీం అలీ..

ఇతను ఒక పక్షి శాస్త్రవేత్త ఇతనికి పక్షులంటే ప్రాణం వాటి కోసం ఎన్నో చేసిన ఘనత ఈయన సొంతం.. ఈయన జీవితం మొత్తం పక్షులకే అంకితం చేసేశాడు పక్షులపై పరిశోధనల కోసం ప్రపంచం మొత్తం చుట్టేశాడు.. తన చిన్న తనం లో ఒక పక్షి ని చంపడం వలన తనకి పక్షులపై మరింత ప్రేమ పెరిగిపోయింది.. చిన్ననాటి నుండి పక్షుల మీద ప్రేమ పెంచుకున్న సలీం అలీ వాటి కోసమే అన్నట్టు బ్రతికాడు..

ఇలా పక్షుల కోసం చేసిన ప్రతిఫలమే తనకు ఎన్నో అవార్డ్ లని తీసుకొచ్చింది.. ఇతనిని భారత ప్రభుత్వం పద్మ భూషణ్ మరియు పద్మ విభూషణ్ వంటి గొప్ప అవార్డు లని ఇచ్చి ఘనంగా సత్కరించారు.. ఇతని గొప్పతనం తెలుసుకున్న డైరెక్టర్ శంకర్ అతనిని ఆదర్శనంగా తీసుకొని రోబో 2.0లో అక్షయ్ కుమార్ కి ఆ పాత్ర ని రూపొందించాడు..


Spread the love