K.T.R సార్ మీ నిర్లక్ష్యం వల్ల నా స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు:నాగ్ అశ్విన్

Spread the love

మహానటి వంటి అద్భుత చిత్రం తెరకెక్కించిన దర్శకుడు నాగ అశ్విన్ తెలంగాణా ప్రభుత్వం పై విరుచుకు పడ్డాడు..తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలంగాణ మాజీ మంత్రి KTR ని టాగ్ చేస్తూ,తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్ పై తన అసహనాన్ని వెళ్లబుచ్చాడు..

అసలు విషయానికొస్తే నిన్న దర్శకుడు నాగ అశ్విన్ స్నేహితుడు ప్రముఖ కెమెరా మెన్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు.అతనిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.కాని అతని ప్రాణాలు దక్కలేదు.ఆరోజు ఆదివారం కావడంతో హాస్పిటల్ లో డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో అతను మరణించాడు..

అలా 3 గంటల పాటు చావుబతుకులతో పోరాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్డ్, ఈ వార్డ్ అంటూ అతన్ని చాలా సేపు స్ట్రెచర్‌పై అతని తల్లిదండ్రులు తిప్పారు. పైగా, చనిపోయిన వ్యక్తి గొప్ప కెమెరామెన్. కేవలం వైద్యులు అందుబాటులో లేనికారణంగా ఒక నిండుప్రాణం నిర్దాక్షిణ్యంగా బలైపోయిందంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సమయంలో గాంధీ ఆస్పత్రికి కాకుండా మరో ఆస్పత్రికి తీసుకెళ్లివుంటే ఖచ్చితంగా అతను బతికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి మనిషిని తీసుకెళ్లి ఎందుకు బంతికించుకోలేం, ప్రభుత్వ ఆస్పత్రి అంటే నిర్లక్ష్యానికి, చావుకి మారుపేరు కాకూడదు సార్. దీని గురించి నేనెవర్ని ప్రశ్నించాలో అర్థంకావడం లేదు అని,ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ కేటీఆర్‌ని కూడా ట్యాగ్ చేశారు..

అశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది అసలే ఎన్నికలు జరుగుతున్నా వేళా నాగ అశ్విన్ ఇలా తెలంగాణ ప్రభుత్వం పై తన అసహనాన్ని చూపించి ప్రభుత్వాధికారులకు చుక్కలు చూపిస్తున్నాడు…


Spread the love