మెగా అభిమానులకి షాక్ ఇచ్చిన సైరా చిత్రబృందం

Spread the love

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తో సమ్మర్ లో మెగా అభిమానులను కనువిందు చేస్తారు అనుకున్నవారికీ చేదు అనుభవం మిగలనుందా . అవును అనే విశ్వసనీయత వర్గాల సమాచారం..రామ్ చరణ్ ఎంతో ఖర్చు పెట్టి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..

ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసి మెగా అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని నింపింది.. కానీ విడుదల తేదీలో మాత్రం మెగా అభిమానులకి నిరాశే మిగలనుంది..ఈ సైరా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా పనితో కూడుకున్నది కనుక మరింత సమయం పట్టే అవకాశం ఉంది..

ఈ సినిమాని బాలీవుడ్ లో మరియు తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు..బాలీవుడ్ లో ఈ సినిమా పై మంచి మార్కెట్ ని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న రామ్ చరణ్ కి విజువల్ పరంగా బాగా చేయాలని ఏ సినిమాని 2020 లో సంక్రాంతికి విడుదల చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయ్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.. అలాగే సైరా చిత్ర యూనిట్ కూడా అదే రోజు విడుదల చేస్తామని వార్తలు వినిపించాయి.. కానీ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు వాటికి సంభందించిన విజువల్ ఎఫెక్ట్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడు అందుకే ఈ సినిమాని 2020 లో విడుదల చేస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..


Spread the love