జాన్వీ కపూర్ సోదరిని రేప్ చేస్తామని బెదిరింపులు

Spread the love

దివికేగిన అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఈ మధ్య విడుదలైన ధఢక్ సినిమాతో మనందరినీ అలరించింది..శ్రీదేవి చనిపోయాక తన కూతుళ్ల భాధ్యత అర్జున్ కపూర్ దగ్గరుండి చూసుకుంటున్నారు..అర్జున్ కపూర్ కి ఒక సొంత చెల్లెలు కూడా ఉంది తానే అన్షులా ఇప్పుడు వీళ్లందరూ ఒకే దగ్గర చాలా సంతోముగా ఉంటున్నారు.

మొన్న బాలీవుడ్ లో టాప్ షో అయినా కాఫీ విత్ కరణ్ షో కి అర్జున్ కపూర్ అలాగే జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు.
ఆ సమయంలో కరణ్ అడిగిన ఏదో ప్రశ్నకు హెల్ప్ లైన్ నంబర్ గా తనసోదరి అన్షులా కపూర్ నంబర్ కు డయల్ చేసింది జాన్వీ. అన్షులా జాన్వీ వాళ్ల పెద్దమ్మ కూతురు.జాన్వీ హెల్ప్ లైన్ నంబర్ గా అన్షులాకు ఫోన్ చేయగా, ఆమె హెల్ప్ చేయడానికి నో చెప్పిందట..

ఇదంతా సరదాగా సాగిపోతున్న షో కనుక జాన్వి కూడా పెద్దగా పట్టించుకోలేదు..ఇదే అదనుగా తీసుకున్న కొంతమంది జాన్వి అభిమానులు అన్షులా మీద విరుచుకుపడ్డారట,మరికొంత మంది అభిమానులు అన్షులాని రేప్ చేస్తామని బెదిరించారని జాన్వి బాధపడిపోయింది..

సోషల్ మీడియా అనేది అందరి సంతోషాలను పంచుకోవాలనే కాని ఇలా అనవసరమైన మాటలు అని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని జాన్వి వాపోయింది..అడ్డగోలు మాటలు, నీఛమైన మాటలు, బూతు కామెంట్లు పెట్టేవారిని మానసిక రోగులుగా అభివర్ణించింది జాన్వీకపూర్.


Spread the love