బాల్య వివాహాలు జరిపిస్తానని వింత ప్రచారం చేసిన BJP అభ్యర్థి

Spread the love

బాల్య వివాహాలు జరిపిస్తాను అని హామీ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని షాక్ కి గురిచేసిన శోభా చౌహన్.
వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి శోభా చౌహన్ తనను గెలిపిస్తే బాల్య వివాహాలు కు సహకరిస్తాను అని నిందితుల పై కేసు లు లేకుండా చేస్తామని పోలీసులు జోక్యం లేకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో గెలుపే ద్యేయం గా నాయకులూ వింత హామీల పై నెటిజన్లు బీజేపీ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్తున్నారు. ఒక వైపు బీజేపీ ప్రభుత్వం స్వచ్ భారత్ , బేటీ బచావో,భేటీ పడావో కార్యక్రమాలతో ప్రచారం సాగిస్తుంటే రాజస్థాన్ లోని పాలి జిల్లా సొజాత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శోభా చౌహన్ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రచారంలో ఇబ్బందికర హామీతో ఇరుకుల్లో పెట్టేసారు .

ప్రస్తుతానికి దుమారం రేపుతున్న ఈ హామీ ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షాలు బీజేపీ పై తీవ్రంగా విమర్శిస్తున్నారు . శోభా చౌహన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు .


Spread the love