కే.సి.ఆర్ కి జై కొట్టిన ఆంధ్ర ముద్దు బిడ్డ

Spread the love

నా పేరు అరవింద్… నాది ఈస్ట్ గోదావరి.
నా ఓటు కెసిఆర్ గారికే…ఇది ఒక తెలుగోడుకి కెసిఆర్ మీద ఉన్న అభిమానానికి గుర్తు,

గత 10 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్ లో ఉన్నాను. (నేను తూర్పు గోదావరి జిల్లా వాడిని). కెసిఆర్ గారు వచ్చినప్పటినుండే 24 గంటలు కరంటు, వాటర్ వస్తున్నాయి. ఆంధ్రా నుండి తెలంగాణా విడిపోయినప్పుడు తెలంగాణా కి కరంటే రాదన్నారు… కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చిన మొగాడు , మొనగాడు కెసిఆర్.

ప్రతి సమ్మర్ లో నీటికి పడరాని పాట్లు పడే వాళ్లం… నీటి సమస్య నూటికి నూరు శాతం తీర్చిన భగీరధుడు కెసిఆర్.

హైదరాబాద్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంత విపరీతంగా ట్రాఫిక్ పెరిగినా కూడా, సమస్యని 90% పరిష్కరించిన అసలు , సిసలైన అడ్మినిస్త్రెటర్ కెసిఆర్. అప్పట్లో నిత్యం ప్రతి ప్రాంతంలో టైం తో సంభందం లేకుండా ట్రాఫిక్ జాం అయ్యేది.

ప్రజలని పరిపాలించడానికి 100% అర్హత ఉన్న నాయకుడు అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం కావాలి.

తెలంగాణా వస్తే ఆంధ్రా వారికి రక్షణ లేదన్న ప్రచారాన్ని అబద్దపు ప్రచారంగా నిరూపించి… ఆంధ్రా వాళ్లని తెలంగాణా కడుపులో పెట్టుకుని చూసుకున్న మనసున్న మారాజు కెసిఆర్.

కెసిఆర్ గారి పరిపాలని ప్రజలు అంత బలంగా కోరుకుంటున్నారు…

ఒక ఆంధ్రా వాడిగా కెసిఆర్ గారిలో ఒక గొప్ప పరిపాలన దక్షుడిని, మానవతా వాదిని నేను చూశాను… తెలంగాణా మిత్రులారా… తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి కెసిఆర్ గారు కష్టపడింది చాలా చాలా తక్కువ… కానీ, తెలంగాణా ఏర్పాటు అయ్యాక… కొత్త రాష్ట్రానికి ఆయన చేసిన న్యాయం అపారం…

పట్టుదలతో సాదించుకున్న తెలంగాణా ని నిగ్రహంతో కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలంగాణా బిడ్డమీద, తెలంగాణా గడ్డ మీద నివిశించే ప్రతి ఒక్కరిపై ఉన్నది.

మరోసారి కెసిఆర్ గారికి ఓటు వెయ్యండి.

అరవింద్,
ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్
(నివాసం హైదరాబాద్).

జై ఆంధ్రప్రదేశ్.
జై తెలంగాణ.

తెలంగాణ ప్రజలు ఇదే నిజమని భావిస్తున్నారని అనుకుంటున్నారా. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Spread the love