అనసూయకి షాక్ ఇచ్చిన యాంకర్ వర్షిణి

Spread the love

ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటారో వాళ్ళే అనుకున్నది సాధిస్తారు అది గ్లామర్ ప్రపంచమైన గ్రామర్ ప్రపంచమైన ఇక సినిమా వాళ్ళ విషయానికొస్తే ఇది ఇంకొంచెం ఎక్కువుగా ఉంటుంది.. అందులో బుల్లితెర నటులైతే మరీ ఎక్కువ.. ఆ కోవలోకి ఇప్పుడు అందాల హాట్ ఆంటీ అనసూయ కూడా చేరిపోయింది..

జబర్దస్త్ లో ఏళ్ళ తరబడి యాంకరింగ్ చేస్తున్న అనసూయ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ అలరిస్తుంది.. కానీ ఎన్ని అవకాశాలు వచ్చిన కూడా జబర్దస్త్ ని మాత్రం వదల్లేదు.. మొన్న ఒక రెండు వారాలు జబర్దస్త్ కి అనసూయ రాలేకపోయింది.. ఆ ప్లేస్ లో యాంకర్ వర్షిణి ని తీసుకొచ్చారు జబర్దస్త్ నిర్వహకులు అసలు కథ అక్కడే మొదలైంది..

జబర్దస్త్‌కి కొత్త అందం అవసరం అని, అనసూయ కూడా బోర్ కొట్టేసి ఆంటీలా కనిపిస్తోందని, వర్షిణిని పర్మినెంట్‌ చేసేయండని కామెంట్లతో పబ్లిక్‌ జబర్దస్త్‌ మేనేజ్‌మెంట్‌కి కామెంట్ల రూపంలో ఫీడ్‌బ్యాక్‌ బలంగా ఇస్తున్నారు. దీంతో అనసూయని రీప్లేస్‌ చేయాలా, వర్షిణిని పర్మినెంట్‌ చేయాలా అనే ఆలోచన కూడా స్టార్ట్‌ అయినట్టు గుసగుసలాడుకుంటున్నారు.

ఇదే జరిగితే అనసూయ ఇంకో అవకాశాన్ని వెతుకోవాల్సిందే.. మొదటి నుండి ఎన్ని అవతారాలు వచ్చిన జబర్దస్త్ కుర్చీ ని మాత్రం వదల్లేదు.. ఇప్పుడు ఈ అందాల యాంకర్ పోటీల్లో వర్షిణి ని తట్టుకొని అనసూయ నిలబడుతుందో లేదో చూడాలి..


Spread the love