క్యాన్సర్ తో భారత్ కి తిరిగొచ్చిన సోనాలి బింద్రే

Spread the love

బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర కథానాయకులతో నటించిన సోనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్ కి గురైన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని తాను చెప్పిన తర్వాత తన అభిమానులు ఎంతో బాధకి గురయ్యారు ఆ తర్వాతా తాను చికిత్స కొరకు న్యూయార్క్ కి వెళ్లిన విషయం తెలిసిందే..

తాను చికిత్స తీసుకుంటూనే అభిమానులతో అన్ని పంచుకునేది.. ఇప్పుడు సోనాలి బింద్రే చికిత్స అనంతరం ముంబై కి తిరిగొచ్చారు..‘నా హృదయం ఎక్కడైతే ఉందో (భారత్‌) అక్కడికి బయలుదేరుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను.చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని,నా శ్రేయోభిలాషులని, మిత్రులను కలుసుకుంటున్నందుకు చాల ఆనందగా ఉంది. కాన్సర్‌తో నా పోరాటం ఇంకా ముగియలేదు అంటూ సోనాలి తెలియజేసింది.

Actress Sonali Bendre Returns After Cancer Treatment To Mumbai

సోనాలీ ఆరోగ్య పరిస్థితిపై సోనాలి భర్త గోల్డీ మాట్లాడుతూ.. సోనాలీ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తను వేగంగా కోలుకుంటుందని.. ప్రస్తుతానికి న్యూయార్క్ లో చికిత్స ముగిసిందని పేర్కొన్నారు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరిగి రావచ్చు. అందుకని చెకప్ లు చేయిస్తున్నాం తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసారు..


Spread the love