తమిళనాట ‘ఐరెన్ లేడీ’ గా పేరు మార్చుకున్న నిత్య మీనన్

Spread the love

తమిళనాట ఇక నుంచి అమ్మ గా మారనున్న నటి నిత్యామీనన్ .

అస్సలు విషయానికి వస్తే ఈ తరం నటులలో ఏ పాత్ర కు అయిన న్యాయం చేయగల కథానాయకి నటి నిత్యా మీనన్. పలు పాత్రలతో ఎల్లప్పుడూ ప్రజలకు కొత్తగ కనపడేందుకు ఉత్సాహం కనబరిచే నాయికిలలో అగ్ర స్థానం లో ఉండే నిత్యా మీనన్ తమిళనాట అమ్మ గా పిలవబడే మాజీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి జీవిత కధ లో నటిస్తున్నారు .

జయలలిత రెండో వర్ధంతి సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం . ఈ చిత్రానికి ది ఐరన్ లేడీ అనే పేరును పెట్టనున్నట్టు దర్శకురాలు ప్రియదర్శిని తెలిపారు . జయలలిత ను పలువురు నేతలు కూడా ఐరన్ లేడీ అని పిలిచేవారు.

ప్రేక్షకులనుంచి అనూహ్య స్పందన లభిస్తుంది సోషల్ మీడియా లో పలువురు అభిమానులు అమ్మను చూసినట్లే ఉందని సంతోషం వ్యక్తపరిచారు.


Spread the love