కుటుంబ సేవ కావాలంటే తెలంగాణ ని వదిలేయ్ కెసిఆర్ ని కడిగేసిన కుష్బూ

Spread the love

మహబూబ్ నగర్ జిల్లా జెడ్చెర్ల లో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి వచ్చిన ప్రముఖ నటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూ కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.

కెసిఆర్ ది ప్రజా పాలన కాదని కుటంబ పాలన మాత్రమే అంటున్న సినీ నటి కుష్బూ .తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కుష్బూ తీవ్రంగా ఆరోపణలు చేసారు .బ్రతుమ్మ చీరాల పేరుతో 2022 కోట్లు స్వాహా చేసారు అని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబంలో నలుగురు కోసం 4 కోట్లమంది ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు .

కెసిఆర్ సచివాలయం కు వెళ్లకుండా ప్రజాదనం తో నిర్మించుకున్న ప్రగతి భవన్ లో ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అన్నారు. రైతులకు కెసిఆర్ ప్రభుత్వం పై నమ్మకం పోయిందని కెసిఆర్ ఇచ్చిన ఏ హామీ ని సక్రమంగా పూర్తి చేయలేదని తీవ్రంగా విమర్శించారు .

కెసిఆర్ పాలనలో అవినీతి మరియు నేరాలలో తెలంగాణ ప్రధమ స్థానం లో ఉందన్నారు . మహాకూటమి ప్రజల కోసం ఏర్పడిన కూటమి అని ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ప్రచారం లో పాల్గొన్న కుష్బూ విజయం మహాకూటమి దేనని దీమా వ్యక్తం చేసారు.


Spread the love