అగ్ర నటులతో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన అర్జున్ రెడ్డి

Spread the love

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకి మంచి పేరొచ్చింది.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు విజయ్.. ఆ తర్వాత మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.. ఇవన్నీ తనకి ఒక అదృష్టంగా కలిసొచ్చాయి..

తాజాగా ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ చోటు సంపాదించాడు.. అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ధనవంతుల్లో విజయ్ దేవరకొండ పేరును ఫోర్బ్స్ జాబితాలో చేర్చారు.. 2018 అత్యధిక ఆదాయాన్ని పొందిన సినీ సెలబ్రిటీస్ లిస్టులో విజయ్ ని కూడా చేర్చింది ఫోర్బ్స్.. ఈ ఫోర్బ్స్ జాబితాలో 14 కోట్ల ఆదాయంతో విజయ్ 72 వ స్థానంలో నిలిచాడు..

ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించినందుకు విజయ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.. ఈ ఫోర్బ్స్ లిస్టులో సౌత్ ఇండియా నుండి అగ్ర స్థానంలో సూపర్స్టార్ రజినీకాంత్ నిలవగా పవన్ కళ్యాణ్, విజయ్, మహేష్ బాబు, సూర్య, విజయ్ సేతుపతి వంటి అగ్ర నాయకులు నిలిచారు.. ఈ ఫోర్బ్స్ లిస్టులో అగ్ర కథానాయకి నయనతార  కి కూడా చోటు దక్కింది..

బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో సల్మాన్ ఖాన్ 253. కోట్లతో ప్రధమ స్థానంలో నిలువగా భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 228.09 కోట్లతో తర్వాతో స్థానంలో నిలిచాడు.. విజయ్ దేవరకొండ ఈ ఘనతని ఇంత తక్కువ సమయంలో సాధించినందుకు సినీ ప్రముఖులు మరియు విజయ్ అభిమానులు తనకి అభినందనలు తెలియజేసారు..


Spread the love