ప్రపంచానికి సవాలు విసురుతున్న సుమంత్ ఇదం జగత్ సినిమా విడుదల

Spread the love

హీరో సుమంత్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే సుమంత్ నటించిన సత్యం సినిమా నుండి త్వరలో రాబోతున్న ఇదం జగత్ వరకు అనేక రకాల పాత్రలు సుమంత్ చేశాడు.ఇదం జగత్ అంటే అంతా ప్రపంచమయం వాళ్లకి వేరే అవకాశం లేదు అన్నిటికి మూలం ఈ ప్రపంచం అని అర్థం వచ్చేలా ఈ సినిమా ని దర్శకుడు రూపుదిద్దాడు.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన గోదావరి సినిమాలో సుమంత్ ఎంత నార్మల్ గా ఉన్నాడో త్వరలో రాబోతున్న ఇదం జగత్ లో అందుకు భిన్నంగా ఫుల్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

సుమంత్ కి జోడిగా అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ ఇందులో సుమంత్ చేసిన పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.

నవంబరు ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్


Spread the love